నీ రూపం
నా కళ్ళ ముందుకు వచ్చే దాకా
నీ మౌనం
నా హృదయానికి తాళం వేసే దాకా
నీ మనసులోని మాటల అర్ధాలు
నా మనసుని చేరే దాకా
నీ చూపుల కోతలు
నా ఎదురుచూపును ముగించే దాకా
నీ శ్రావ్యమైన తలపులు
నా మదిని కదిపే దాకా
నీ స్వప్నాల రంగుల లోకంలో
నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను
ఇట్లు
నీ చిన్నా
తామర రేకులవంటి
నీ కన్నుల చూపుల
వొంపుల సొంపులు తెలుసుకోవాలని
చంద్రునివంటి
నీ మోము వెలుగులో కరిగిపోవాలని
నీకైనా తెలియని నీ
మనసు లోతుల్లోకి
నేనుగా చేరుకోవాలని
నీ శ్రావ్యమైన మాటల
శ్రవణాలను అందుకోవాలని
సదా నీ సేవలో
నీ చిన్నా