Sunday, 23 November 2014

నేను నీ కవిత్వం...


నీ ఆలోచనలో
ఐపొయానే నీకు దాసోహం

నీ కన్నులలో
అవుతానే నేను నీ స్వప్నం

నీ పెదవిపై
నేను నీ కవిత్వం

నా గుండెలపై
నీవు నా స్పందనం

నీ పాదాలలో
నేను నీ అందలం

నీ ఆనందానికి
నా జీవితం అంకితం

-
చిన్నా 

Saturday, 22 November 2014

నీ నవ్వు చూస్తుంటే...



నాకు ఆనందం
నీ గురించి ఆలోచిస్తుంటే

నాకు ఆనందం
నీ కోసం ఎదురు చూస్తుంటే

నాకు ఆనందం
నీ మాట వింటుంటే

నాకు ఆనందం
నీ తోడు నడకంటే

నాకు ఆనందం
నువు నను వీడిపోకుంటే

నాకు ఆనందం
నీ నవ్వు చూస్తుంటే

నాకు ఆనందం
నీ నా ప్రేమంటే


-
చిన్నా

నీ నవ్వుపైన నా ప్రేమ...



ప్రతి క్షణం నీ తలపులే
నీ కోసం ఆవేదనే

కలలోనూ నీ రూపమే
యదలయలో ఆలోచనే

ఇన్నాళ్ళుగా నాకే తెలియని
నా లోకం నువ్వై పోయావే...

నా కోసం పుట్టిన దేవత నీవై
నాకు దూరం అవుతావేం ?

కనులు దాచిన...
కలవు నీవని
కలత మదిన రగిలే...

జీవితాంతమూ నీ ప్రేమ కోసమూ
నిను వీడి పోను లేనే...

నీ నవ్వుపైన నా ప్రేమ 
అనుకుంటూ నీకై నేనేనా

ఇంతకన్నా ఎలా చెప్పను
నన్ను చదవలేవా..?

-
చిన్నా

Friday, 21 November 2014

నీ కలల నిధుల కోసం...



నా పయనం మొదలైంది
నీ వలపు తలపు కోసం

నా నయనం అడిగింది
నీ కలల నిధుల కోసం

మది చప్పుడు ఆగింది
నీ మనసు తోడు కోసం

ఆవేదన సాగుతోంది
నను చేరే నీ కోసం

నా కాలం కదులుతోంది
నువు తెలిపే బదులు కోసం
నను చేరు క్షణం కోసం

నాపై కురిపించే
నీ శ్రావ్యమైన ప్రేమ కోసం

-
చిన్నా 

Thursday, 20 November 2014

శ్రావ్యమైన నీ మాటలు...


కనులు కలత చెందుతున్నాయి
నీ చూపుల కలయిక లేదని

మాటలు మూగబోతున్నాయి
నీ శ్రవణం తెలియలేదని

యదలోని తలపులు
చిందులేస్తున్నాయి
నీ ఆలోచన వాటికి దొరుకుతుందని

పాదాల అడుగులు వెనకబడుతున్నాయి
నీ పాదాల తోడు లేదని

నా కరములు కంగారు పడుతున్నాయి
నీ చెంపల సొంపులు తాకలేదని

చెవులు బెట్టుచేస్తున్నాయి
శ్రావ్యమైన నీ మాటలు చేరలేదని

నా హృదయం తల్లడిల్లుతోంది
నిను కలిసిన ఈరోజు
నువు నా దరిన లేవని

Happy Aniversary

-
చిన్నా