ఇన్నాళ్ళ తరువాత
నను చేరిన నీ ఉత్తరం
నా మదిన చేసిన
ఒక చిన్నపాటి అలజడి
నా సంతోషాల ఉప్పెనలా
నను ఆకాశానికి ఎత్తేస్తోంది
ఏదో తెలియని ఆనందం
ఇంకేదో తెలియని కంగారు
నీ ఉత్తరాల లేఖలు ముగిసి
నీ శ్రావ్యమైన మాటలు
ఎప్పుడు వినిపిస్తావా అని
నా మదికి పెరిగిన ఉత్సాహం
నీకోసం ఇంకా ఇంకా
నా మనసునీ
దానికి నీపై ప్రేమనీ
రెట్టింపు చేస్తున్నాయి
ఈ అమితనందాలతో
ఇన్నాళ్ళ నా ఒంటరి ఎదురుచూపుని మరిపించి
నీకోసం నీ గ్నాపకాలతో
ఎదురు చూస్తూ ఉంటాను
-
చిన్నా
